Home  »  TV News  »  Karthika Deepam2 : పూజలో శివన్నారాయణ‌ కోపం.. అంతా కార్తీక, దీపల మంచికేనా!

Updated : Oct 30, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -188 లో......దీప పెట్టిన కండిషన్ కి కాంచన ఒప్పుకొని శ్రీధర్ ని పిలవడానికి వెళ్తుంది. నేను రాకుంటే ఏం చేస్తావని శ్రీధర్ అనగానే.. కార్తీక్ తండ్రిగా మీరు వస్తారని కాంచన అంటుంది. మీరు ఒక్కరే రండీ రెండో భార్య అంటే చులకనగా చూస్తారని కావేరిని ఇండైరెక్ట్ గా రాకని అనసూయ చెప్తుంది. ఈవిడ ఎవరు ఇలా మాట్లాడుతుందని కావేరి అనగానే.. తనతో పెట్టుకోకు అని శ్రీధర్ అంటాడు. నువ్వు వెళ్తావా అని కావేరి అడుగుతుంది. వెళ్తావా కాదు కచ్చితంగా వెళ్ళాలని శ్రీధర్ అంటాడు. ఆ తర్వాత దీప దగ్గరికి శౌర్య బట్టలు తీసుకొని వస్తుంది. ఎవరు కొనిచ్చారని దీప అడుగుతుంది. నానమ్మ కొన్నది.. రేపు పూజ కదా... ఏది వేసుకోవాలని శౌర్య అనగానే.. రేపు పూజ జరగదని దీప అంటుంది. జరుగుతుందని శౌర్య అంటుంది.

మరొకవైపు కుబేర్ ఫోటో పట్టుకొని వెతుకుతాడు దాస్. ఆ తర్వాత వీళ్లంతా ఎక్కడికి వెళ్లారని దీప అనుకుంటుంది. అప్పుడే కాంచన వాళ్ళు వస్తారు. రేపు పూజలో మీ దంపతులని ఆశీర్వదించడానికి మా దంపతులం వస్తున్నామని కాంచన అనగానే.. దీప షాక్ అవుతుంది. మీ అత్త కోపం పక్కన పెట్టి మీ కోసం వెళ్లి పిలిచిందని అనసూయ చెప్తుంది. దీప లోపలికి వెళ్తుంది . ఆ తర్వాత దీప బయట బాధపడుతుంటే అనసూయ వచ్చి.. మీ అత్త మీ కోసం ఇంత చేస్తుందంటూ కాంచన, కార్తీక్ ల గురించి గొప్పగా  చెప్తుంది.

ఆ తర్వాత దాస్ కి ఫోన్ చేస్తుంది పారిజాతం. సత్యనారాయణ వ్రతానికి వెళ్తున్నామని దాస్ అంటాడు. అప్పుడే ఫోన్ తీసుకొని కార్తీక్, దీప అక్కలు పూజ చేస్తున్నారు. పిలిచారు వెళ్తున్నామని కాశీ చెప్తాడు. దాంతో పారిజాతం కోప్పడుతుంది. ఆ తర్వాత కార్తీక్ దగ్గరికి‌ దీప వచ్చి.. ఎప్పుడు మీ శ్రేయోభిలాషిని అంటారు కదా మీ పక్కన కూర్చొని పూజ చేయలేను.. ఆపండి అని దీప చెప్తుంది. తరువాయి భాగంలో పూజ జరిగాక జ్యోత్స్న వచ్చి దీపని తిడుతుంది. నా కొడుకు, కోడలిని ఆశీర్వదించండి నాన్న అని శివన్నారాయణ‌తో కాంచన అంటుంది. శివన్నారాయణ‌ కోపంగా అక్షింతలు విసిరేస్తాడు. అవి దీప, కార్తీక్ లపై పడతాయి. కాంచన హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.